telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదల…

దేశంలో ప్రస్తుతం మొత్తం 5 రాష్ట్రలో ఎన్నికలు జరగనున్నాయి. అందులో తమిళనాడు కూడా ఒక్కటి/. అయితే ఈ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసింది.. విద్యా సంస్ధల్లో అడ్మిషన్లకు జాతీయ స్ధాయిలో నిర్వహించే నీట్‌ పరీక్షల రద్దుతో మద్యం దుకాణాలను మూసివేస్తామని హామీ ఇచ్చింది. ప్రతి జిల్లా కేంద్రంలో 500 మంది యువకులకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం శిక్షణ ఇస్తామని టీపీసీసీ చీఫ్‌ కేఎస్‌ అళగరి తెలిపారు. స్టార్టప్‌లు, నూతన ఎంట్రప్రెన్యూర్‌లను ప్రోత్సహించేందుకు ఆయా సంస్ధలకు ఐదేళ్ల పాటు పన్ను మినహాయింపు ఇస్తామని ప్రకటించారు. కులాంతర వివాహాలు చేసుకున్న జంటలను కాపాడేందుకు చర్యలు చేపడతామని పరువు హత్యల నియంత్రణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తామని వెల్లడించారు. తమిళనాడులో శాసనమండలిని తిరిగి ప్రవేశపెడతామని, స్ధానిక సంస్ధల బలోపేతానికి చర్యలు చేపడతామని కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. అయితే మరి ఈ మేనిఫెస్టో ప్రజల పైన ఏ మాత్రం ప్రభావం చూపుతుంది అనేది ఎన్నికలో చూడాలి.

Related posts