telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

వాహనదారుడికి రూ.13.80 కోట్ల జరిమానా… ఎందుకంటే…!?

Motorist

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 106 ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన ఆసియా వాహనదారుడిని షార్జా పోలీసులు గురవారం అరెస్ట్ చేశారు. అనంతరం అతడు పాల్పడిన ట్రాఫిక్ ఉల్లంఘనలకుగాను రూ.13.80 కోట్ల జరిమానా విధించారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు సదరు వాహనదారుడు అక్రమంగా ప్రయాణికులను ఎక్కించుకోవడం గుర్తించారు. దాంతో అతడ్ని అదుపులోకి తీసుకొని విచారించారు. వాహనదారుడి డేటాను పరిశీలించిన పోలీసులు అతడి వాహనంపై 106 చలాన్లు ఉండడం చూసి షాక్ అయ్యారు. వసిట్ పోలీస్ స్టేషన్ అధికారి మహ్మద్ అబ్దుల్‌ రహ్మాన్ బిన్ కస్ముల్ మాట్లాడుతూ… సదరు వాహనదారుడు ఈ 106 ట్రాఫిక్ ఉల్లంఘనలు కేవలం ఒక ఏడాది వ్యవధిలోనే పాల్పడినట్టు తెలిపారు. అతడిపై మొదటి ట్రాఫిక్ ఉల్లంఘన 2018, ఆగస్టు 16న నమోదైనట్లు పోలీస్ అధికారి చెప్పారు. ఆ తరువాత ఏడాది కాల వ్యవధిలోనే మరో 105 ఉల్లంఘనలకు పాల్పడ్డాడని రహ్మాన్ బిన్ కస్ముల్ వివరించారు.

Related posts