telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

మహిళతో డాక్టర్ అసభ్య ప్రవర్తన.. అరెస్ట్ చేసిన పోలీసులు

SIT Investigation YS viveka Murder

వైద్య వృత్తికే కళంకం తెచ్చేలా ఓ డాక్టర్ వ్యవహరించాడు. తలనొప్పి బాధిస్తోందన్న మహిళను లైంగికంగా వేధించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా సదరు డాక్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తెలంగాణలోని హైదరాబాద్ లో ఈరోజు చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలుకనగర్ బస్తీకి చెందిన ఓ మహిళకు గతకొంతకాలంగా తలనొప్పి వస్తోంది. ఎన్ని మందులు వాడినా నొప్పి తగ్గకపోవడంతో ఆమె బస్తీలో ఉన్న ఆసుపత్రికి వచ్చింది.

అక్కడ డా.బాలరాజుకు తన బాధ చెప్పుకుంది. తలనొప్పికి తోడుగా తరచూ దగ్గు కూడా వస్తోందని చెప్పింది. తలనొప్పి తగ్గాలంటే మసాజ్ చేయాలని ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లాడు. అనంతరం శరీరంపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. అక్కడి నుంచి బయటపడిన బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి డా.బాలరాజు పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసికొని డా.బాలరాజును అరెస్ట్ చేశారు.

Related posts