telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఉండవల్లిలోని ప్రజా వేదిక కూల్చివేత

Prajavedika

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజావేదిక పేరుతో కట్టించిన భవనాన్ని కూల్చివేయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు ఉండవల్లిలోని ప్రజావేదిక హాలులో కలెక్టర్ల సమావేశంలో జగన్ మాట్లాడుతూ ఈ ప్రజా వేదిక అక్రమ కట్టడమని, దీనికి పర్యావరణ అనుమతులు కానీ, గ్రీన్ ట్రిబ్యూనల్ పర్మిషన్ కానీ, నదుల సంరక్షణ చట్టాలు కానీ ఏవీ పాటించలేదని, 5 కోట్ల బడ్జెట్ తో ప్రారంభించిన ఈ కట్టడాన్ని 9 కోట్లతో పూర్తి చేశారని, దీన్ని బట్టి ఇందులో ఎంత అవినీతి జరిగిందో అర్థం చేసుకోవచ్చని జగన్ చెప్పారు. మన పాలనలో పారదర్శకత ఉండాలని, అవినీతి ఉండకూడదని, అందుకే ఈ ప్రజా వేదికలో ఇదే చివరి సమావేశం కావాలని, ఎల్లుండి కల్లా ఈ ప్రజావేదికను కూల్చి వేయాలని జగన్ మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశాలిచ్చారు. జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న అత్యంత్య సాహసోపేతమైన నిర్ణయమిది.

Related posts