telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణలో విద్యాసంస్థలకు మరో 3 రోజులు పాటు సెలవులు పొడిగింపు

*తెలంగాణ‌లో విద్యాసంస్థలకు  మ‌రో మూడురోజులు సెల‌వులు పొడిగింపు
*శ‌నివారం వ‌ర‌కు సెల‌వులు పొడిగింపు
*వ‌చ్చే సోమ‌వారం తిరిగి ప్రారంభం

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో మూడు రోజులు సెలవులు పొడిగిస్తూ  కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలకు శనివారం వరకు సెలవులను పొడగిస్తున్నట్టు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. తిరిగి బడులు సోమవారం తెరుచుకోనున్నాయి.

గత వారం రోజులగా తెలంగాణలో ఎకధాటిగా వర్షాలు కురుస్తుండంతో  అప్ర‌మ‌త్త‌మైన అప్రమత్తమైన ప్రభుత్వం.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని  అధికారులను ఆదేశించింది. ఈ క్రమంలోనే ఇప్పటికే 3 రోజులపాటు (జూలై 11, 12, 13న) అన్ని విద్యాసంస్థలకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ సెలవులు ప్రకటించింది. తొలుత ప్రభుత్వం ప్రకటించిన సెలవులు నేటితో ముగియనున్నాయి.

కానీ.. రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురియనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో పలు జిల్లాలో కుండపోతగా వర్షం కురుస్తోండ‌డంతో చాలా చోట్ల వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలపై నుంచి వరద నీరు పారుతుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. 

దీంతో అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం మరో మూడు రోజులు సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ఇక, తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో నేడు జరగాల్సిన ఈసెట్ పరీక్ష వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను వాయిదా వేస్తున్నట్టుగా ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. అయితే ఎంసెట్ ఇంజనీరింగ్‌ పరీక్ష మాత్రం షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని వెల్లడించింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి ఒక ప్రటన విడదల చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అగ్రికల్చర్ పరీక్షను మాత్రమే వాయిదా వేస్తున్నట్టుగా చెప్పారు.

జూలై 14,15 తేదీల్లో జరగాల్సి ఉన్న ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను వాయిదా వేస్తున్నట్టుగా వెల్లడించారు. ఈ పరీక్ష నిర్వాహణకు సంబంధించిన కొత్త తేదీని త్వరలోనే వెల్లడించనున్నట్టుగా చెప్పారు. అయితే జూలై 18,19,20 తేదీల్లో జరగనున్న ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష యథావిథిగా కొనసాగనుందని తెలిపారు.

Related posts