telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును ఆమోదించండి: ఎంపీ క‌విత

MP Kavitha comments BBP Govt.
అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఈబీసీ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందిన విష‌యం తెలిసిందే. ఈ బిల్లును మంగళవారం  లోక్‌సభలో ప్రవేశపెట్టగా సభకు హాజరైన వారిలో మూడింట రెండింతలకు పైగా మెజారిటీతో ఆమోదం పొందింది. ఆ బిల్లును టీఆర్ఎస్ ఎంపీలు కూడా స్వాగ‌తించారు. లోక్‌స‌భ‌, రాజ్యసభలోనూ ఈబీసీ బిల్లు చాలా వేగంగా ఆమోదం పొందింది. 
అంతే వేగంగా మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును కూడా పార్లమెంట్ ఆమోదించాల‌ని నిజామాబాద్ ఎంపీ క‌విత అభిప్రాయ‌ప‌డ్డారు. ఈబీసీ బిల్లును ఎంత వేగంగా పాస్ చేశారో.. అంతే స్పీడ్‌తో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును ఆమోదిస్తే.. దేశం నిజంగానే ప్రగ‌తి సాధిస్తుంద‌ని ఆమె అన్నారు. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుకు పార్లమెంట్  లో ఆమోదం ద‌క్కాలంటే, దానికి బ‌ల‌మైన రాజ‌కీయ సంక‌ల్పం ఉండాల‌ని ఎంపీ క‌విత తెలిపారు.

Related posts