telugu navyamedia
రాజకీయ వార్తలు

కశ్మీర్ ను విభజించిన కేంద్రం.. ఇక జమ్ముకశ్మీర్, లద్ధాఖ్‌!

jammu and kashmir state

జమ్మూ కశ్మీరు రాష్ట్రం పై కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ కలిసి ఉన్న జమ్ము, కశ్మీర్‌ రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం విడగొట్టింది. జమ్ముకశ్మీర్, లద్ధాఖ్‌ లగా విభజించింది. లడఖ్ ను అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది. జమ్ముకశ్మీర్ ను అసెంబ్లీ కలిగి ఉండే కేంద్రపాలిత ప్రాంతంగా చేసింది.

ఇరు ప్రాంతాలకు వేర్వేరు లెఫ్టినెంట్ గవర్నర్లు ఉంటారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. జమ్ముకశ్మీర్ కు ఇప్పటివరకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ముందస్తు వ్యూహంతో పార్లమెంటులో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన క్షణాల వ్యవధిలోనే ఇవన్నీ చోటు చేసుకోవడం గమనార్హం.

Related posts