telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

హైదరాబాదులో అంతర్జాతీయ స్టోర్ల మూసివేత!

Ikea store hyderabad

చాపాకింద నీరులా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో అంతర్జాతీయ స్టోర్లు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాదులోని తమ స్టోర్ ను ఈరోజు నుంచి మూసివేస్తున్నట్టు ఇంటర్నేషనల్ ఫర్నిచన్ జెయింట్ ఐకియా ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో పాటు నగరంలోని నైకీ, అడిడాస్, యాపిల్ వంటి అంతర్జాతీయ స్టోర్లు కూడా మూతపడ్డాయి.

తమ ఉద్యోగులు, వినియోగదారుల సంక్షేమం కోసమే స్టోర్లను మూసివేస్తున్నట్టు ఈ కంపెనీలు తెలిపాయి. మరోవైపు హైదరాబాదులో కరోనా విస్తరించకుండా జీహెచ్ఎంసీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో డీఆర్ఎస్‌ సిబ్బంది క్రిమి సంహారక మందు స్ప్రే చేస్తున్నారు. ప్రజలు అధికంగా ఉండే బస్‌ స్టాండులు, మెట్రో స్టేషన్ల వద్ద పార్కుల్లో ఈ పనులు కొనసాగుతున్నాయి.

Related posts