ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
సహచర పార్లమెంటు సభ్యులతో కలిసి, చిత్తూరు ఎంపి శ్రీ దగ్గుమళ్ళ ప్రసాద రావు గారు పాల్గొని, అల్లూరి చిత్రపటానికి పుష్పాలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు.
ఏపీ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి మన్యం వీరుడికి ఘన నివాళులర్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు దేశభక్తిని ఈ సందర్భంగా ప్రసాద్ రావు గారు కొనియాడారు.