telugu navyamedia
రాజకీయ వార్తలు

నదులను అనుసంధానం చేయాలి: వెంకయ్య

Venkaiah-Naidu

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సహకరించాలని వెంకయ్య సూచించారు. గోదావరి, పెన్నా నదులను కావేరితో అనుసంధానం చేయాలని ఈ సందర్భంగా వెంకయ్య అన్నారు. ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ, తమిళనాడులో కరువు ప్రాంతాలకు సాగు, తాగు నీరందించాలని వెంకయ్య చెప్పారు.

నదుల అనుసంధానానికి రూ.3 వేల కోట్లు విడుదల చేయాలని వెంకయ్య విజ్ఞప్తి చేశారు.ఈ మొత్తాన్ని నాబార్డు ద్వారా విడుదల చేసేందుకు కేంద్రం చొరవ తీసుకోవాలని వెంకయ్య సూచించారు. నిధుల కొరతతో ప్రాజక్టు ఆలస్యం కారాదన్నదే తన అభిమతం అని స్పష్టం చేశారు. 1981-82లో పోలవరం ప్రారంభమైందని, ఈ ప్రాజక్టు త్వరితగతిన పూర్తయ్యేందుకు రాష్ట్రానికి తోడ్పాటునందించాలని కోరారు. ప్రాజక్టు విస్తరణలో అడ్డంకులపై పర్యావరణశాఖతో మాట్లాడాలని మంత్రికి సూచించారు.

Related posts