telugu navyamedia
రాజకీయ వార్తలు

అక్కడ ఎన్నికలపై కరోనా ప్రభావం పడుతుందా..?

corona

ప్రస్తుతం మన దేశంలో 5 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే సరిగ్గా ఈ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనుండే దేశంలో కరోనా కేసులు పెరగడం ప్రారంభమయ్యాయి. పాజిటివ్ కేసులతో పాటుగా రోజువారీ మహమ్మారి మరణాల సంఖ్య పెరుగుతోంది.  ఒకే చోట ఎక్కువమంది చేరొద్దని ప్రభుత్వాలు చెప్తున్నాయి.  ఈ సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు.  తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది.  ఈ రెండు రాష్ట్రాల్లో ఏప్రిల్ 6 వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి.  కరోనా ప్రభావం ఈ రెండు రాష్ట్రాలపై అధికంగా ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ఈ రెండు రాష్ట్రాలతో పాటుగా పుదుచ్చేరిలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి.  తమిళనాడుతో ఏపీకి, కేరళలో కర్ణాటకకు సరిహద్దులు ఉన్నాయి.  ఒకవేళ ఆ రెండు రాష్ట్రాల్లో కేసులు పెరిగితే, ఆ కేసుల ప్రభావం తెలుగు రాష్ట్రాలతో పాటుగా సౌత్ లోని అన్ని రాష్ట్రాలపై కనిపించే అవకాశం ఉంది.  అదే విధంగా అస్సాం, వెస్ట్ బెంగాల్ లో కూడా ఎన్నికల సమయంలో కేసులు పెరిగితే మహమ్మారిని కట్టడి చేయగలమా అన్నది అందరి ముందున్న ప్రశ్న.  నామినేషన్లు, ప్రచారం సమయంలో వేలాది మంది ఒకే చోట చేరుతున్నారు.  ఒక చోట ఎక్కువ మంది ఉండొద్దని చెప్తూనే, ఎన్నికల సమయంలో ఒకేచోట వేలాది మంది చేరుతున్నారు. చూడాలి మరి ఈ ప్రభావం ఎన్నికల సమయం వరకు పెరుగుతుందా… తగ్గుతుందా.. అనేది.

Related posts