జిల్లా పంచాయతీ అధికారులు జిల్లా పరిధిలోని పలు గ్రామాలను ఆయా గ్రామాల పరిధిలోని పరిశ్రమలకు దత్తత ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జిల్లా కలెక్టర్ డా.ఎంవీ రెడ్డి సూచనల మేరకు జిల్లా పరిధిలోని 61 గ్రామాల కార్యదర్శులతో జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో గ్రామాల్లో శానిటేషన్, డంపింగ్‌యార్డు, శ్మశాన వాటిక, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, టాక్స్ డిమాండ్, డాష్‌బోర్డులో కార్యదర్శి పనితీరు, సీసీ రోడ్ల నిర్మాణం, హరితహారం తదితర అంశాలపై సమీక్షించిన ఆయన గ్రామాల దత్తతపై చర్చించారు. ముందుగా జిల్లా పరిధిలో 9 గ్రామాలు (పూడూరు, శామీర్‌పేట్, మూడుచింతలపల్లి, కీసర, చౌదరిగూడ, ఏదులాబాద్, చీర్యాల్, డబీల్‌పూర్, అంకిరెడ్డిపల్లి) గ్రామాలను పరిశ్రమలు దత్తత తీసుకొని అభివృద్ధి చేపట్టేలా జిల్లా పంచాయతీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
గత సందాయాలను పాటించలేదు: అచ్చెన్నాయుడు