telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

న్యూస్ రీడర్ మృతికి సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్‌…

KCR cm telangana

ఏడిద గోపాలరావు రేడియో న్యూస్ రీడర్ గా ప్రజలకు బాగా సుపరిచితం. అయితే ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు విచారం వ్యక్తం చేశారు. రేడియోలో వార్తలు చదవడం ద్వారా మాత్రమే కాకుండా రంగస్థల నటుడిగా కూడా గోపాలరావు పేరు ప్రఖ్యాతలు సంపాదించారని సీఎం గుర్తు చేశారు.  గోపాలరావు వివిధ సాంస్కృతిక సంస్థలు, సంఘాల కార్యక్రమాలకు ఇతోధిక సహాయ సహకారాలు అందించారని సీఎం అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా… ఆకాశవాణి న్యూఢిల్లీ కేంద్రంగా వార్తలు చదివేవారు ఏడిద గోపాలరావు. రష్యాలో కూడా కొంతకాలం వుండి వార్తలు చదివారు. న్యూఢిల్లీలో సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో నిర్వహించారు. సరస నవరస సంస్థను స్థాపించి ఢిల్లీలో, హైదరాబాద్లో జాతీయ నాటకోత్సవాలు నిర్వహించారు ఏడిద గోపాలరావు. ఆయన సోదరుడు ప్రముఖ చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరరావు. అయితే ఏడిద గోపాలరావు మృతి పట్ల ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 

Related posts