telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పబ్ లు, క్లబ్ లను నిషేధించాలి: డీకే అరుణ డిమాండ్

dk-aruna

తెలంగాణలో దిశ, మానస, సమతలపై అత్యాచారాలకు మద్యమే కారణమని బీజేపీ నాయకురాలు డీకే అరుణ అన్నారు. యువతను పెడదారి పట్టిస్తున్న పబ్ లు, క్లబ్ లను నిషేధించాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. మద్యం వల్ల అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో బెల్టు షాపులు పెరిగిపోతున్నా కేసీఆర్ కు కనిపించడం లేదని విమర్శించారు.

ఉద్యమం సమయంలో చెప్పిన మాటలను కేసీఆర్ మర్చిపోయారని అన్నారు. మద్య నిషేధం వైపు ఏపీ ప్రభుత్వం అడుగులు వేయడం మంచి పరిణామమని అరుణ ప్రశంసించారు. తెలంగాణలో కూడా మద్యాన్ని నిషేధించేందుకు సమయం ఆసన్నమైందని అన్నారు. రాష్ట్రంలోని మహిళలు, చిన్నారుల భవిష్యత్తుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచించాలని హితవు పలికారు.

Related posts