telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మండలి తీర్మానానికి వ్యతిరేకంగా వెళ్లే అధికారం ఎవరికీ లేదు: యనమల

Yanamala tdp

శాసన మండలి తీర్మానానికి వ్యతిరేకంగా వెళ్లే అధికారం ఎవరికీ లేదని మండలి విపక్ష నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. చైర్మన్‌ ఆదేశాలను పాటించకుంటే కార్యదర్శి బాధ్యుడవుతారని హెచ్చరించారు. ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన సీఆర్‌డీఏ చట్టం రద్దును ప్రభుత్వం అడ్డుకుంటోందనన్నారు.

మూడు రాజధానుల ప్రతిపాదనలను సెలెక్ట్‌ కమిటీకి పంపాలన్న శాసన మండలి చైర్మన్‌ నిర్ణయాన్ని వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటోందని శాసన ఆరోపించారు. అయితే మండలి చైర్మన్‌ నిర్ణయాన్ని ప్రశ్నించడం, ధిక్కరించడం అధికారుల వల్ల కాదని స్పష్టం చేశారు. అలా వెళ్లేవారెవరైనా సభ తీసుకునే నిర్ణయానికి బాధ్యులవుతారని తెలిపారు.

Related posts