telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వీళ్లకు అసలు సిగ్గు, శరం లాంటివి ఏమైనా ఉన్నాయా?… కత్తి మహేష్ పై మాధవీలత ఫైర్

MAdhavilatha

“రాముడికి ఇష్టమైన వంటకం జింక మాంసం, నెమలి తొడ అని.. సీత, రాముడిని జింకను తెమ్మన్నది తినడానికే” అంటూ కత్తి మహేశ్ చేసిన వ్యాఖ్యలపై హిందువులు భగ్గుమన్నారు. హిందూ మతాన్ని హేళన చేస్తూ.. రాముడి క్యారెక్టర్‌పై కత్తి మహేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయనపై నాంపల్లి పీఎస్‌లో కేసు నమోదైంది. కేవలం నాంపల్లిలోనే కాకుండా రాష్ట్రంలోని పలు పోలీసు స్టేషన్లలో కత్తి మహేశ్‌పై ఫిర్యాదులు అందుతుండగా ఈ ఇష్యూపై ఘాటుగా స్పందించారు సినీ నటి మాధవీలత. ఆమె మాట్లాడుతూ.. “పవన్ కళ్యాణ్‌ని తిట్టి బాగా ఫేమస్ అయ్యాడు.. అప్పట్లో రామాయణంపై నోటికొచ్చినట్టు మాట్లాడి నగర బహిష్కరణ గురయ్యాడు. మళ్లీ ఇప్పుడు సీతమ్మ తల్లిపై దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. సీతమ్మ జింకను తినిడానికి రాముడ్ని అడిగింది. అంతపురంలో సుఖించే వాడు. రాముడు ఏకపత్నీవ్రతుడు కాదు. మాంసాహారం తినేవాడు అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అతను బాగా చదువుకున్నాడు.. చాలా నాలెడ్జ్ ఉన్నవాడే. కాని.. మనం చదువుకున్న చదువు ఏం నేర్పుతుంది? ఓ మనిషి నీతిగా ఎలా బతకాలి.. అన్నదానిపైనే జీవితం ఆధారపడి ఉంది. దేవుళ్లుపై, రాజులపై ఎన్ని కథలు ఉన్నా.. క్రిష్ణుడు ఎనిమిది మంది భార్యల్ని చేసుకున్నాడని కథల్లో ఉన్నప్పటికీ మీరు కూడా ఎనిమిది మందిని చేసుకోమని ఎక్కడా చెప్పలేదు. ప్రతిదానికి ఒక మోరల్ స్టోరీ ఉంటుంది. మనిషి ఎలా బతకాలన్నదానికి ఆ స్టోరీస్ ఉపయోగపడతాయి. వాటిద్వారా మన లైఫ్‌ని ఎంత బాగా లీడ్ చేసుకోగలమో చెప్పడానికే ఈ కథలు ఉంటాయి. అవి తరతరాలకు ఉపయోగపడటానికి కథలుగా రాస్తారు. రామాయణంలో చెప్పారని వాళ్లు ఇలా చేశారు.. వీళ్లు ఇలా చేశారు.. రాముడు వందమందితో తిరిగాడు.. సీతమ్మ జింకను వేటాడుకుని తిన్నది అంటూ చెప్తున్నారీయన. ఇందులో మంచి ఎక్కడ కనిపిస్తుంది. రాముడు మంచి వాడు అంటే మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. రావణుడు రాక్షసుడు అంటే బాడీ వైబ్రేట్ అవుతుంది. ఎందుకంటే అది నెగిటివ్ సెన్స్. రాముడు ఈజ్ పాజిటివ్ సెన్స్.. రావణుడు ఈజ్ నెగిటివ్ సెన్స్. రామాయణంపై చాలా కథలు ఉన్నాయి.. చాలా రామాయణాలు ఉన్నాయి. 18 పైగా రామాయణాలు ఉన్నాయి. వీటిలో మనకి ఏది మంచి అని అనిపిస్తే దాన్నే తీసుకుంటాం.

రాముడు మంచిగా పరిపాలించాడు కాబట్టే ఆయన్ని దేవుడిగా పూజిస్తున్నాము. రామాయణంలో అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల అనుబంధం, తల్లిదండ్రుల ప్రేమ, ప్రజల సంక్షేమం ఇలా చాలా ఉన్నాయి. దేవుడు అంటే చిన్న సాయం చేసినా దేవుడే అవుతారు. రాముడు అయోధ్యను పరిపాలించినప్పుడు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారు కాబట్టే ఆయన్న దేవుడు అన్నారు. ఇప్పటికీ దేవుడిగానే పూజిస్తున్నారు. వాల్మీకి రాసిందే రామయణం అంటే.. నిజమే ఆయన రాసిందే రామాయణం అనుకుందాం.. కాని అందులోని చెడును మాత్రమే తీసుకునే వాళ్లకు అసలు ఎథిక్స్ ఉన్నాయా? నీకు దేవుడు అంటే నమ్మకం లేకపోతే మూసుకుని ఉండు. నమ్మేవాళ్ల విలువల్ని ఎందుకు చంపేస్తారు. ఆ హక్కు మీకెక్కడిది? రామాయణంలో ఉన్న తప్పుల్ని మాత్రమే ఎత్తి చూపాలి అనుకుంటే రాముడిలోనే కాదు క్రిష్ణుడిలోనూ జీసస్‌లోనూ, అల్లా లోనూ అందరి కథల్లోనూ మిస్టేక్స్ ఉంటాయి. కాని ఆ మిస్టేక్స్ పట్టుకుని ఊగడం జీవితం కాదు. నువ్ చూశావా? రాముడు జింకను కొట్టుకుని తిన్నది. ఇలాంటి పిచ్చి పిచ్చి కథలు చెప్పొద్దు. రామాయణంలో రాశాడట.. ఏమో రాశారమే నేను చదవలేదు కాని.. నేను రాముడ్ని దేవుడిగా, సీతను దేవతగా కొలుస్తా.. వద్దు అనడానికి నువ్వెవడివి? నేను రాముడ్ని పూజిస్తా. ఎథిక్స్ మోరల్స్ లేని వెధవలు ఇదిగో ఇలాగే (కత్తి మహేష్) ఉంటారు. వాళ్లకు బంధాలు, అనుబంధాలకు, బంధుత్వాలు అర్ధం కూడా తెలియదు. ఇలాంటి వాళ్లే పెళ్లాలని సిగరెట్‌లతో కాల్చేది.. కేస్‌లలో పెట్టేది. రక్త సంబంధం అంటే కొంచెం కూడా విలువ ఇవ్వకుండా తల్లిదండ్రుల్ని ఓల్డేజ్ హోమ్‌లలో పిల్లల్ని అనాథ శరణాలయాల్లో వదిలేసేది ముఖాలు ఇదిగో ఇలాగే ఉంటాయి. ప్రపంచ దేశాలు సైతం మన రామాయణంపై రీసెర్చ్‌లు చేసి భారతీయ సాంప్రదాయాల గురించి గొప్పగా చెప్తుంటే.. మనదేశంలో పుట్టి మనదేశంలో పుట్టినవాళ్లే అవమానంగా మాట్లాడుతుంటే.. వీళ్లకు అసలు సిగ్గు, శరం లాంటివి ఏమైనా ఉన్నాయా? బోలెడు పుస్తకాలు చదివి నాలెడ్జ్ పెంచేసుకున్నా అంటే ఏం పీకడానికి చదువుతున్నావ్. సొసైటీలో ప్రశాంత వాతావరణాన్ని క్రియేట్ చేయాలేనటువంటి మీ సభలు, స్పీచ్‌లు ఎవర్ని ఉద్దరించడానికి? నాకు టెంపర్ బాగా పెరిగిపోతుంది. నేను మళ్ళీ దీని మీద మాట్లాడతా.. అప్పుడు చెప్తా ఒక్కొక్కడి పని.. ఎవడైతే పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తారో…” అంటూ కత్తి మహేష్‌కి గట్టి వార్నింగ్ ఇచ్చింది మాధవీలత.

Related posts