telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

రామ్ చరణ్ తో మహేష్ భామ… నిజమేనా…?

టాలీవుడ్ టాప్ హీరోలలో రామ్ చరణ్ ఒక్కడు. అయితే చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ అలాగే తన తండ్రి చేస్తున్న ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాల తర్వాత చెర్రీ స్టార్ డైరెక్టర్ శంకర్ తో సినిమా చేయనున్నాడు. అయితే ఇందులో రామ్ చరణ్ సరసన నటించనుంది ఎవరనీ ఇటీవల సందేహాలు వచ్చాయి. లక్కీ బ్యూటీ రష్మికా అంటూ వార్తలు కూడా హల్ చల్ చేశాయి. కానీ ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేయనుండటంతో హిందీ హీరోయిన్‌ను పెట్టాలని మేకర్స్ ఆలోచించారు. దీనికోసం కియారా అద్వానీని ఎంపిక చేసినట్లు టాక్ వచ్చింది. ప్రస్తుతం కియారా వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే కియారా ఇంతకు ముందు రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ సినిమాలో నటించింది. అది కియారాకు తెలుగులో రెండో సినిమా మాత్రమే.. అయితే ఆ సినిమా భారీగా ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. దాంతో మరోసారి ఈ భామ చెర్రీ సరసన చేసేందుకు ఒప్పుకుంటుందా అనేది చర్యనీయాశం అయ్యింది. చూడాలి మరి ఈ సినిమాలో చెర్రీ సరసన నటించే అవకాశం ఎవరికీ దక్కుతుంది అనేది.

Related posts