ఇవాళ మహా శివరాత్రి. ఈ పండుగ దినాన ప్రతి ఇంట్లో నూతన ఉత్సాహం నెలకొంటుంది. పొద్దున్న లేసి.. పుణ్య స్నానాలు చేసి… శివుని గుడికి వెళ్తారు. కొందరు శివుని కోసం ఉపవాసం ఉంటారు. అలా చేస్తే శివుని అనుగ్రహం ఉంటుందని అందరి నమ్మకం.అయితే ఇవాళ ఉపవాసం చేసే వాళ్ళు ఈ నియమాలు పాటించండి.
మరీ కఠినంగా ఉపవాసాలు చేయకూడదు.
శరీరాన్ని డిహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి
ఉపవాసం ఉన్నవాళ్లు పుచ్చకాయ, బొప్పాయి సలాడ్ తీసుకోవాలి. ఎందుకంటే వాటిలో నీటి శాతం ఎక్కువ. బొప్పాయి లో విటమిన్స్ అధికం.
సహజ పానీయాలు కూడా తీసుకోవాలి
గ్లాస్ పాలు, అరటిపండు కలిపి మిల్క్ షాక్ చేసుకొని తాగితే.. శరీరానికి పోషకాలు సమృద్ధిగా అందుతాయి. ఇలా రోజులో 6 సార్లు తీసుకోవడం మంచిది.
సాయంత్రం కొబ్బరినీళ్లు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఉత్తమం.ఈ నియమాలు పాటిస్తే… మన బాడీ ఆరోగ్యాంగా ఉంటుంది.