telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పెద్దమ్మ గుడిలో వీహెచ్.. ప్రమాణానికి రాని కేటీఆర్!

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత పీ వి.హనుమంతరావు మండిపడ్డారు. గ్లోబరీనా సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదని పెద్దమ్మ గుడిలో కేటీఆర్ ప్రమాణం చేయాలని వీహెచ్ సవాల్ విసిరారు. ఇందుకోసం మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల వరకు కేటీఆర్‌ కోసం వేచి చూశారు. అయితే ఎంతకీ కేటీఆర్ రాకపోవడంతో వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యార్ధులకు జరిగిన అన్యాయాన్ని అమ్మవారి దృష్టికి తీసుకువెళుతూ ప్రభుత్వంపై శాపనార్ధాలు పెట్టారు. రెండేళ్ల లోపే ప్రభుత్వం కూలిపోతుందని, విద్యార్ధులకు అన్యాయం తలపెట్టినవారెవరు బాగుపడరని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లు ఐటీ మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌కు గ్లోబరీనా అనే సంస్థ గురించి తెలియదా అని హనుమంతరావు నిలదీశారు. కేటీఆర్ పెద్దమ్మ గుడికి రాకపోవడంతో ఆ కంపెనీతో ఆయనకున్న అనుబంధం నిజమని స్పష్టమైందన్నారు.

Related posts