ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు తెలంగాణ వాసులను అనుమానంతోనే చంపేస్తుంది. కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఫీవర్ ఆస్పత్రిలో చేరారు. ఇందులో నాలుగేళ్ల బాలిక కూడా ఉంది. ఇప్పటికే ఫీవర్ ఆస్పత్రిలో అయిదుగురు అనుమానితులు ఉండగా.. ఇప్పుడు మరో అయిదుగురు చేరారు. ప్రత్యేక వైద్య బృందం పర్యటిస్తుండగానే.. ఇటీవల చైనాకు వెళ్లి వచ్చిన ఒక కుటుంబానికి చెందిన భర్త , భార్య , కూతురు.. జలుబు, దగ్గుతో ఫీవర్ ఆస్పత్రికి వచ్చారు. ఈ ముగ్గురినీ ఐసోలేటెడ్ వార్డులో ఉంచి పరీక్షలు నిర్వహించారు. కేంద్ర బృందం వెళ్లిపోయిన కొద్దిసేపటికే 37 ఏళ్ల మరో వ్యక్తి వచ్చి చేరారు. మరో వ్యక్తి కరోనా వైరస్ భయంతో ఆస్పత్రికి రావడంతో అతన్ని అడ్మిట్ చేసుకున్నారు.
ప్రస్తుతానికి ఆస్పత్రిలోని ఐసోలేటెడ్ వార్డులో ఆరుగురు చికిత్స పొందుతున్నారు. వీరంతా ఇటీవల చైనాకు వెళ్లి వచ్చారు. తెలంగాణను సైతం కరోనా వైరస్ భయపెడుతోంది. హైదరాబాద్‌లో కరోనా వైరస్ అనుమానితులను గుర్తించినట్టు ప్రచారం సాగుతోంది. అయితే అలాంటిదేమీ లేదని… ప్రజలు ఆందోళన చెందవద్దని ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరారు. ఇవాళ కోరోనా వైరస్‌పై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు వైద్యశాఖ ఉన్నతాధికారులతో ఈసమీక్ష నిర్వహిస్తారు. గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డుల ఏర్పాటు, అనుమానితుల గుర్తింపు, శస్త్రచికిత్సలపై ప్రధానంగా చర్చించనున్నారు.
చంద్రబాబు నివాసం చుట్టూ మంత్రుల చక్కర్లు: అచ్చెన్నాయుడు