telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

భర్తీ చేసిన ఉద్యోగాల పై బహిరంగ లేఖ విడుదల చేసిన కేటీఆర్

ktr telangana

తమ సర్కార్ వచ్చిన తర్వాత ఇన్ని ఉద్యోగాలు ఇచ్చామని.. చర్చకు సిద్ధమంటూ మంత్రి కేటీఆర్ సవాల్ చేయడంతో.. విపక్షాల నుంచి కూడా అదే రేంజ్‌లో ప్రతిసవాళ్లు వచ్చాయి. దీంతో.. తమ ప్రభుత్వ హయంలో భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలతో బహిరంగ లేఖ విడుదల చేశారు టీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్.. ఉద్యోగాలపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని… అర్థసత్యాలు, అసత్యాలతో యువతను గందరగోళంలోకి నెడుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌, బీజేపీలు నిజాలను దాడి… అబద్దాలను ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. 2014 నుంచి 2020  వరకూ లక్షా 32,899 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారాయన. అధికారంలోకి వస్తే ఉద్యోగాలిస్తామన్న మాటను నిలబెట్టుకున్నామన్నారు కేటీఆర్‌. పదేళ్ల కాంగ్రెస్‌ హయాంలో ఎన్నో ఉద్యోగాలిచ్చామన్న జానారెడ్డి… తెలంగాణకు ఎన్నిచ్చారో చెప్పాలన్నారు. త్వరలోనే మరో 50 వేల ఉద్యోగాల భర్తీ చేస్తామని… ఎలక్షన్‌ కోడ్‌ ముగియగానే భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు. జానారెడ్డి లాంటి సీనియర్‌ కూడా అసత్యాలు చెప్పడం బాధాకరమన్నారు కేటీఆర్.. ప్రతిపక్షాల అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని యువతకు సూచించారు. చూడాలి మరి దీని పై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయి అనేది.

Related posts