telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

టీఆర్ఎస్ లో ఓనర్ల పంచాయతీ, జీతగాళ్ల పంచాయతీ బయట పడింది

తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ లో ఓనర్ల పంచాయతీ, జీతగాళ్ల పంచాయతీ బయట పడిందని..ఈటల డిమాండ్ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలపై కూడా విచారణ జరపాలని..కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు…ప్రభుత్వం చేతులెత్తేసిందని ఫైర్ అయ్యారు. సీఎం స్పందించడం లేదని.. ప్రజల దృష్టి మరల్చడానికే ఈ పంచాయతీ అని పేర్కొన్నారు. కరోనాపై సీఎం సమీక్ష చేయలేదు..మీరు, మీరు తన్నుకోవడానికి మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారా ? అని నిలదీశారు. టీఆర్ఎస్ ప్రభుత్వమే అవినీతి, కబ్జాల ప్రభుత్వం..సీఎం కెసిఆర్ కుటుంబంపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సీఎంకు అనుకూల… వ్యతిరేక మంత్రులు ఉన్నారని.. వ్యతిరేక మంత్రుల అవినీతిపై మాత్రం విచారణ జరిపిస్తున్నారని చురకలు అంటించారు. అవినీతి ఆరోపణలు వచ్చిన మిగతా మంత్రుల సంగతి ఏంటి ? అని నిలదీశారు. సీఎం కోవిడ్ తో రెస్ట్ తీసుకుంటున్నారు అనుకనున్నాం కానీ స్కెచ్ వేస్తున్నాడు అని అనుకోలేదని.. మీడియాకు విజ్ఞప్తి అవినీతిని బయట పెట్టాలన్నారు. దొంగల ముఠా తయారు అయింది..దోచుకుతింటున్నారు…అధికారుల మీద కూడా విచారణ చేయాలని డిమాండ్ చేశారు.

Related posts