telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

విజయనగరంలో అమిత్ షా.. రాష్ట్రానికి 5.56 లక్షల కోట్లు ఇచ్చాము.. చర్చకు బాబు సిద్ధమా..

TDP Mla anitha comments Roja YCP

2019లో మోడీ మళ్ళీ ప్రధాని కావటం ఖాయం. అప్పుడు మళ్ళీ చంద్రబాబు ఎన్డీయే లోకి రావటానికి ప్రయత్నించటం ఖాయం. కానీ ఎన్డీయే మాత్రం ఈసారి చంద్రబాబుకు అవకాశం ఇవ్వదు. రాష్ట్రానికి బీజేపీ ఏమిచేయలేదని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. ఏపీకి చెందిన 14 కీలక అంశాలలో 10 ఇప్పటికే పూర్తిచేశాము. దీనిపై ఎక్కడైనా చంద్రబాబుతో చర్చకు సిద్ధం, ఆయన సిద్ధమా?

తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమి తరువాతే, చంద్రబాబు మహాకూటమి అంటూ పాట ప్రారంభించారని అమిత్ షా విమర్శించారు. మొత్తం 20 జాతీయ సంస్థలను ఏపీకి ఇచ్చాము. 2014కు ముందు కాంగ్రెస్ ఏపీకి 1.4 లక్షల కోట్లు ఇస్తే; బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి 5.56 ఇచ్చిందని అమిత్ షా చెప్పారు. దీనిని బట్టే బీజేపీ ఏపీ పై చూపిస్తున్న ప్రాధాన్యతనుఁ గుర్తించాలని ఆయన అన్నారు.

ఇక రాయలసీమ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు 14 ఏళ్ళు సీఎం గా ఉండి, సీమలో ఎన్ని ప్రాజెక్టులు పూర్తిచేసారో చెప్పాలని అమిత్ షా ఎద్దేవా చేశారు. ప్రత్యేక ప్యాకేజీ ని చంద్రబాబే అసెంబ్లీ లో స్వాగతించారు.. ఇప్పుడు నీచంగా బీజేపీ పార్టీ మహిళా నేతలను బెదిరిస్తున్నారు.. అమరావతి, పోలవరం ప్రాజెక్టులలో తీవ్రమైన అవినీతి జరిగిందని ఆయన అన్నారు. చంద్రబాబు తన కొడుకును సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికే ఈ నాటకాలన్నీ అని ఆయన అన్నారు. ఇప్పటికే ఆయన చర్యలు గ్రహించిన ఏపీ ప్రజలు బాబును వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. అదికూడా గ్రహించిన బాబు బీజేపీని సాకుగా చూపించి, ఎన్డీయే నుండి వైదొలిగారు అని విమర్శించారు. టీడీపీ, వైసీపీ రెండు కుటుంబ అవినీతి పార్టీలేనని ఆయన అన్నారు. అటువంటి వారితో ఏపీ అభివృద్ధి సాధ్యం కాదని అమిత్ షా అన్నారు. ఇటువంటి అవినీతికి చెక్ పెట్టేందుకు బీజేపీ అధికారంలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

Related posts