telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు విద్యా వార్తలు

ఏపీ నిరుద్యోగులకు సీఎం జగన్‌ శుభవార్త…

cm jagan ycp

ఇవాళ అటానమస్‌ కాలేజీల్లో పరీక్షా విధానం, జగనన్న విద్యాదీవెనపై క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్‌…సమీక్షలో విద్యారంగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు. అటానమస్‌ కాలేజీల్లో పరీక్షల విధానంలో మార్పులు చేయాలని… అటానమస్‌ కాలేజీలే సొంతంగా ప్రశ్నపత్నాలు తయారు చేసుకునే విధానం రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అటానమస్, నాన్‌ అటానమస్‌ కాలేజీలకు జేఎన్టీయూ రూపొందించిన ప్రశ్నపత్నాలు ఇవ్వాలని ఆదేశించారు సీఎం జగన్‌. అంతేకాదు..ఏపీ నిరుద్యోగులకు సీఎం జగన్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. ఈ మేరకు పోస్టుల భర్తీపై సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది భర్తీ చేయనున్న పోస్టులపై క్యాలెండర్‌ సిద్ధం చేయాలని అధికారులకు సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. ఉగాది రోజున క్యాలెండర్‌ విడుదల చేసేలా చూడాలన్న సీఎం జగన్‌… ఈ ఏడాది 6 వేల మంది పోలీసు నియామకాలు చేయాలని ఆదేశించారు. ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు వీలైనంత త్వరగా నిధులను విడుదల చేయాలని ఆదేశించారు సీఎం జగన్‌.

Related posts