ప్రపంచ దేశాలు కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయాదని అనేక చర్యలు తీసుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా వ్యాప్తిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విటర్ లో స్పందించారు. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్న దేశాలను గురించి ప్రస్తావించారు. ‘హాంకాంగ్, సింగపూర్, జపాన్ దేశాలు కరోనాను సమర్థవంతంగా అరికడుతున్నాయని తెలిపారు.
ఇటలీ, అమెరికా వంటి దేశాలు మాత్రం సరైన సమయంలో సరైన రీతిలో స్పందించలేకపోయినందుకు విచారం వ్యక్తం చేస్తున్నాయి’ అని తెలిపారు.’సామాజిక దూరం, వ్యక్తిగత నిర్భందం, నియంత్రణలు పాటించడం చాలా ముఖ్యం. దయచేసి ప్రభుత్వం చేస్తోన్న సూచనలు పాటించి సురక్షితంగా ఉండండి’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఉద్యమ నాయకుడు సీఎం కావడం ప్రజల అదృష్టం: తలసాని