telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మహానటి పాత్రలో అనసూయ

anasuya

జీ తెలుగు ఉగాది ఈవెంట్ బాబు గారింట్లో బుట్ట భోజనంలో అనసూయ మహానటి పాత్రలో కనిపించింది. ఆమె జీవితాన్ని ఓ చిన్న స్కిట్ రూపంలో చేసి చూపించింది అనసూయ. దానికి మంచి రెస్నాన్స్ వచ్చింది కూడా. సావిత్రి పాత్రలో అనసూయ నటించడం ఇదే తొలిసారి కాదు. అప్పట్లో అన‌సూయ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా చందన‌ బ్ర‌ద‌ర్స్ అదిరిపోయే యాడ్ ఒక‌టి షూట్ చేసారు. మాయాబ‌జార్‌లోని అహ నా పెళ్లంట పాట‌ను వాళ్ల క్యాస్ట్యూమ్స్‌తో అన‌సూయ‌తో షూట్ చేసారు. చంద‌న‌ బ్ర‌ద‌ర్స్ యాడ్ అంటూ మ‌ధ్య‌లో ఎస్వీఆర్ పాత్ర‌లో సింగ‌ర్ మ‌నో కూడా క‌నిపించాడు. ఇప్పుడు మరోసారి ఇలాంటి స్కిట్ చేసింది ఈమె. ఓ వైపు షోల‌తో పాటు సినిమాల్లోనూ బిజీ అయిపోతుంది అన‌సూయ‌. పైగా న‌ట‌న‌లో కూడా మెప్పు పొందుతుంది. రంగ‌మ్మ‌త్త పాత్రే దీనికి నిద‌ర్శ‌నం. అటు సినిమాలు ఇటు టీవీ షోల‌తో వేడి పుట్టిస్తూనే ఉంది. ఇప్పుడు కూడా వ‌ర‌స సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ‌.

Related posts