telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

ప్రతి గొప్ప కూతురి వెనుక ఓ గొప్ప తండ్రి: రోజా

roja ycp mla

ఫాదర్స్‌ డే సందర్బంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా గతంలో తన తండ్రితో దిగిన ఫొటోలతో రూపొందించిన వీడియోను పోస్ట్ చేశారు. ప్రతి గొప్ప కూతురి వెనుక ఓ గొప్ప తండ్రి ఉంటారని ఆమె పేర్కొన్నారు. తన తండ్రి ఎప్పటికీ తనతో ఉంటూ తనకు మార్గదర్శకాలు చేస్తుంటారని చెప్పారు.

మనల్ని ప్రేమిస్తున్నామని మన తండ్రి మనకు ఎన్నడూ చెప్పరని ఆమె చెప్పారు. తన ప్రేమను తన చేతల్లో చూపెడతారని ఆమె తెలిపారు. అమ్మాయి తొలి ప్రేమ నాన్నపైనేనని రోజా వ్యాఖ్యానించారు. గొప్ప తండ్రిని ఇచ్చినందుకు మనం దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా తన భర్త, పిల్లలకు సంబంధించిన ఫొటోలను కూడా రోజా పోస్ట్ చేశారు.

Related posts