telugu navyamedia
రాజకీయ వార్తలు

కర్ణాటకీయం : .. ఆ ఇద్దరిపై .. స్పీకర్ వేటు…రాష్ట్రపతి పాలనా .. !

karnataka speaker disqualified two rebels

ఇటీవల జరిగిన బలపరీక్షలో కుమారస్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుని ప్రభుత్వం పడిపోవడానికి కారణమైన వారిలో ఒకరైన స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్ శంకర్ పై స్పీకర్ కేఆర్ రమేష్ అనర్హత వేటు వేశారు. గతంలో కాంగ్రెస్ లో విలీనమవుతున్నట్లు ప్రకటించిన ఆర్ శంకర్ ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీలో చేరేందుకు ప్రయత్నించిన శంకర్ పై 2023 వరకు అనర్హత వేటు వేశారు స్పీకర్. బీజేపీ ఇంకా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకముందే స్పీకర్ నిర్ణయం కీలకంగా మారింది. మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ సిద్దంగా లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు పడుతున్నట్లు సమాచారం.

సంకీర్ణ ప్రభుత్వం పడిపోవడానికి కారణమైన రెబల్ ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకునేవకరకు ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్దంగా లేదన్న వార్తలు ఆ పార్టీ వర్గాల నుంచి వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశముందని స్వయంగా బీజేపీ అధికార ప్రతినిధి మధుసూదన్ తెలిపారు. రెబల్ ఎమ్మెల్యేల రాజీనాయాల విషయంలో స్పీకర్ ఆలస్యంగా నిర్ణయం తీసుకుంటే రాష్ట్రపతి పాలనకు గవర్నర్ రికమండ్ చేయవచ్చని, ఇలాంటి పరిస్థుల్లో తాము ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దంగా ఉండమని మధుసూధన్ తెలిపారు. రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించేంత వరకు వారు అసెంబ్లీ సభ్యులుగానే కొనసాగుతారు. దీంతో మొత్తం 225 సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 113గా ఉంటుంది. ఇప్పుడు బీజేపీకి 106మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశముందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

Related posts