telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

పెళ్ళైన కొత్త జంటను చిక్కుల్లో పడేసిన పర్సనల్ వీడియో

Kuwait

పెళ్లైన కువైట్ కపుల్‌ను వారి పర్సనల్ వీడియో చిక్కుల్లో పడేసింది. సాంప్రదాయిక దేశంలో వివాదాస్పద వీడియోలో కనిపించినందుకు ఓ వివాహిత జంటను కువైట్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీడియోలోని దృశ్యాల ఆధారంగా… భర్త.. భార్య తల దువ్వుతున్న సమయంలో ఆమె వల్గర్‌గా మాట్లాడటం వీడియోలో రికార్డైంది. అంతేగాక ఆమె తన బాడీ మొత్తాన్ని చూపించడం కూడా వీడియోలో ఉంది. ఈ పర్సనల్ వీడియో కాస్తా నెట్టింట ప్రత్యక్షం కావడంతో వైరల్‌గా మారింది. చివరకు పోలీసుల దృష్టిలో పడింది. దీంతో రంగంలోకి దిగిన కువైట్ పోలీసులు వీడియోలోని దృశ్యాల ఆధారంగా మంగళవారం ఆ దంపతులను అదుపులోకి తీసుకున్నారు. దేశ సంస్కృతి సంప్రదాయ విలువలకు విరుద్ధంగా ఉన్న ఈ వీడియోపై కపుల్‌ను పోలీసులు విచారించారు. సాంప్రదాయిక కువైట్ సమాజ స్వభావానికి విరుద్ధమైన అనైతిక అతిక్రమణలను ఎప్పటికీ అనుమతించబోమని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు.


Video Source: Disclosed News

Related posts