వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ఏపీలో వైసీపీ పిచ్చి పరాకాష్టకు చేరిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ వాళ్లు బడినీ, గుడినీ రంగులతో ముంచేశారని, చివరకు ఇసుకకు, ఇంద్రధనుస్సుకు కూడా వారి పార్టీ రంగులు వేసేలా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు.
అన్నవరంలో అన్యమత ప్రచారం జరిగిందని పేర్కొన్నారు. భవానీ ఐలాండ్ లో ఆర్చిపై బొమ్మలను ఏర్పాటు చేశారని దుయ్యబట్టారు. భీమిలి ఉత్సవ్ లో మతపరమైన స్టాల్స్ ఏర్పాటు చేశారని విమర్శించారు. ఇవన్నీ వైసీపీ చేపట్టిన మత వ్యాప్తిని సూచిస్తున్నాయని తప్పుబట్టారు.
టీపీసీసీ పదవిపై నాకు ఆసక్తి లేదు: వెంకటరెడ్డి