telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

విద్యావ్యవస్థపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..

జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనపై సీఎం జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్‌ 9న జగనన్న విద్యాదీవెన కింద ఫీజు రీయింబర్స్‌మెంట్, ఏప్రిల్‌ 27న వసతి దీవెన విడుదలపై అధికారులతో సీఎం జగన్‌ చర్చలు నిర్వహించారు. ఈ ఏడాది నుంచి తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన డబ్బులు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో దాదాపు 10 లక్షలమందికి పైగా విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. అలాగే ఇవాళ అటానమస్‌ కాలేజీల్లో పరీక్షా విధానం, జగనన్న విద్యాదీవెనపై క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్‌…సమీక్షలో విద్యారంగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు. అటానమస్‌ కాలేజీల్లో పరీక్షల విధానంలో మార్పులు చేయాలని… అటానమస్‌ కాలేజీలే సొంతంగా ప్రశ్నపత్నాలు తయారు చేసుకునే విధానం రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అటానమస్, నాన్‌ అటానమస్‌ కాలేజీలకు జేఎన్టీయూ రూపొందించిన ప్రశ్నపత్నాలు ఇవ్వాలని ఆదేశించారు సీఎం జగన్‌. వాల్యూయేషన్‌ కూడా జేఎన్‌టీయూకే అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల్లో అక్రమాల నిరోధానికే చర్యలని స్పష్టం చేశారు సీఎం జగన్‌.

Related posts