telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అన్ని రంగాల్లో పరిపాలనా యంత్రాంగం విఫలం: విజయశాంతి

vijayashanthi

తెలంగాణలో కొనసాగుతున్న వరద భీభత్సంపై రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి ఘాటుగా స్పందించారు. రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందన్నారు. చినుకు పడితే జలమయం అయ్యే హైదరాబాదును ఎలాగూ కాపాడలేకపోయారని దుయ్యబట్టారు. ప్రభుత్వ చేతగానితనంతో ఇప్పుడు వరంగల్ కూడా బలైపోయిందని తెలిపారు. పంటలు నీటమునిగి ఆవేదనలో ఉన్న రైతన్నలను కనీస స్థాయిలోనైనా ఆదుకోలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు.

రాష్ట్రంలో ప్రధాన కొవిడ్ చికిత్సా కేంద్రంగా ఉన్న గాంధీ ఆసుపత్రి అనేక సార్లు అగ్నిప్రమాదానికి గురైందని, అయినప్పటికీ అక్కడి అగ్నిప్రమాద నిరోధక వ్యవస్థ నీరుగారిపోయిన స్థితిలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న రీతిలో ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్కారు తీరుపై డాక్టర్లు, నర్సులు ఎంతో అసంతృప్తితో ఉన్నారని  ఆమె  పేర్కొన్నారు.

Related posts