telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కరోనా ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వ్యాపిస్తోంది: మోదీ

narendra-modi

కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వ్యాపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఏపీ, తెలంగాణ సీఎంలను ఆయా ప్రాంతాల్లో కరోనా ఉద్ధృతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ అమెరికాలో మార్చి 1న 75 కేసులు నమోదు కాగా, ఇప్పుడా కేసుల సంఖ్య 14 వేలకు చేరిందని తెలిపారు. అయితే, ఎండ తీవ్రతకు కరోనా వ్యాపించదు అనే అంశంపై ఆలోచించాల్సి ఉందని తెలిపారు. సౌదీ అరేబియాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ కరోనా వ్యాపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

Related posts