తమిళనాడులో రాజకీయ సంక్షోభం నెలకొందంటూ తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలను మక్కళ్ నీది మయ్యమ్ చీఫ్ కమల హాసన్ సమర్థించారు. గతవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్ మాట్లాడుతూ.. తమిళనాడులో సరైన నాయకుడు లేడని, అధికార, ప్రతిపక్షాల తీరుతో రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయని అన్నారు. తాజాగా, కమలహాసన్ మాట్లాడుతూ.. రజనీకాంత్ వ్యాఖ్యలను సమర్థించారు.
రాష్ట్రంలో నాయకత్వం లోపించిందని అన్నారు. గతంలో ఇక్కడ మంచి నాయకులు ఉండేవారని, ఇప్పుడు రాజకీయ సంక్షోభం నెలకొందని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే నాయకులే కరవయ్యారని కమల్ ఆవేదన వ్యక్తం చేశారు. రజనీకాంత్ గతంలో ఇలానే అంటే ముఖ్యమంత్రి పళనిస్వామి జీర్ణించుకోలేకపోయారని విమర్శించారు. రజనీ మాటల్లో తనకెక్కడా తప్పు కనిపించలేదని కమల్ స్పష్టం చేశారు.
భర్తను అవమానించిన వారికి గడ్డి పెట్టిన సింగర్ సునీత