కరోనా వైరస్ ప్రపంచాన్ని ఆర్ధికంగా చాలా దెబ్బతీసింది. అయితే కరోనా వల్ల రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టంపై ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్ రావు శనివారం మధ్యాహ్నం 2 గంటల నుండి ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహిస్తారు. 2020 – 2021 బడ్జెట్ పై మధ్యంతర సమీక్ష జరుపుతారు. కరోనా ప్రభావం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై, సవరించుకోవాల్సిన అంశాలపై కూలంకషంగా చర్చ జరుపుతారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఆర్థిక శాఖ అధికారులు ఈ సమీక్షలో పాల్గొంటారు. శనివారం నాడు జరిగే సమీక్షలో వచ్చే అంచనాలపై ఆదివారం మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులతో సీఎం సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇక యాదాద్రి దేవాలయ నిర్మాణ పనులపై కేసీఆర్ శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. వైటిడిఎ స్పెషల్ ఆఫిసర్, యాదాద్రి జిల్లా కలెక్టర్, ఆర్ అండ్ బి అధికారులు, దేవాలయ ఈవో తదితరులు ఈ సమావేశంలో పాల్గొంటారు. నిర్మాణ పనుల్లో పురోగతిని సమీక్షిస్తారు ముఖ్యమంత్రి కేసీఆర్.
previous post
next post
ఏపీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది.. రేపు వైసీపీకీ ఇదే గతి పడుతుంది:కన్నా