telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

విద్యార్థికి లక్షరూపాయల సహాయం చేసిన కాజల్ అగర్వాల్..

Kajal

కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ లో సినిమా సెలబ్రెటీలు చాలా మందిని చాలా రకాలుగా ఆదుకున్నారు. అయితే తాజాగా ఓ అభిమానిని కూడా ఆదుకుని భారీగా డబ్బు సహాయం చేసింది హీరోయిన్ కాజల్ అగర్వాల్. వివరాల్లోకి వెళితే… సుమ అనే ఒక అమ్మాయి తన అవసరాన్ని తెలియజేసి, ఆదుకోవాలని అందరినీ సోషల్ మీడియా వేదికగా కోరింది. ప్రస్తుతం తాను ఎం.ఫార్మసీ చదువుతున్నానని, ఈ మధ్యనే తన జాబ్ పోయిందని వెల్లడించింది. పరీక్ష ఫీజుకోసం 83 వేల రూపాయల చెల్లించాల్సి ఉందని చెప్పింది. అవి చెల్లించకపోతే తనను పరీక్షకు అనుమతించరని ఆవేదన వ్యక్తం చేసింది. ఎవరయినా సహాయం చేయండి అని సోషల్ మీడియాలో అభ్యర్ధన చేసింది. ఈ విషయం తెలుసుకున్న కాజల్. ఆ అమ్మాయి చెప్పే దానిలో వస్తావం ఎంత ఉందో తెలుసుకోవడానికి తన టీమ్ ద్వారా ఆరాతీసింది.రంగంలోకి దిగిన టీమ్ అమ్మాయి పరిస్థితి గురించి ఆరాతీసి సుమ కష్టాల్లో ఉన్న విషయం నిజమేనని తేలింది. దీంతో.. వెంటనే అమ్మాయి అకౌంట్ కు లక్ష రూపాయలు పంపించింది కాజల్ . అది కూడా గూగుల్ పే ద్వారా ట్రాన్స్ ఫర్ చేసిందీ బ్యూటీ. ఈ విషయం స్క్రీన్ షాట్ తో సహా సోషల్ మీడియాలోకి రావడంతో కాజల్ ను అందరూ తెగ మెచ్చుకుంటున్నారు.

Related posts