telugu navyamedia
క్రీడలు వార్తలు

క్రీడాస్ఫూర్తిని మరిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్…

నిన్న పాకిస్థాన్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 341 పరుగులు చేసింది. అనంతరం 342 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన పాక్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 324 పరుగులు చేసి ఓడింది. అయితే ఈ మ్యాచ్ లో భారీ లక్ష్య చేధనకు దిగిన పాకిస్థాన్ ఆదిలోనే తడబడింది. టాప్ ఆర్డర్ దారుణంగా విఫలమవడంతో పాకిస్థాన్ 120 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ ఫకార్ జమాన్ ఒంటరి పోరాటం చేశాడు. ఈ క్రమంలోనే సెంచరీ పూర్తి చేసుకొని డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్లి ఆఖరి ఓవర్లో రనౌటయ్యాడు. అయితే చివరి ఓవర్‌లో పాక్ విజయానికి 30 పరుగులు అవసరం కాగా.. ఎంగిడి వేసిన బంతిని జమాన్ లాంగాఫ్ దిశగా ఆడాడు. అయితే రెండో పరుగు తీసే క్రమంలో రనౌటయ్యాడు. ఇక్కడ డికాక్ క్రీడాస్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించాడు. ఫకర్ జమాన్‌ను ఫూల్ చేశాడు. జమాన్ రెండో పరుగు తీసే క్రమంలో బౌలర్ వైపు బంతిని వేయాలని ఫీల్డర్‌కు సూచిస్తూ గట్టిగా అరిచాడు. దాంతో జమాన్ వెనక్కి తిరగ్గా.. బంతిని అందుకున్న డికాక్ వికెట్లను కొట్టేశాడు. అయితే దీనిపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరూ డికాక్ స్మార్ట్‌గా ఆలోచించారంటే.. మరికొందరు ఇది తొండాట అంటూ మండిపడుతున్నారు.

Related posts