telugu navyamedia
సినిమా వార్తలు

మా అన్న తమ్ముల మధ్య గొడవ పెట్టె దమ్ముందా మీకు..

ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా మల్టీస్టారర్ ‘భీమ్లా నాయక్’ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ చిత్రం విషయంలో కక్ష పూరితంగా వ్యవహరించిన ఏపీ ప్రభుత్వంపై మెగా బ్రదర్ నాగబాబు మండిపడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మా అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టే దమ్ముందా మీకు’ అంటూ ఆయ‌న లో ఏపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులకు చిత్ర పరిశ్రమ పట్ల అవగాహన లేదని ..కాబట్టి వాళ్లని నేను ఏం అనలేను.

సామాన్యుడికీ సినిమా టికెట్‌ ధరలు అందుబాటులోకి రావాలని మీరు అంటున్నారు. దాన్ని నేనూ అంగీకరిస్తా. కానీ, మన సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవాలంటే దాన్ని తెరకెక్కించడంలో కాస్త ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.

నటీనటుల పారితోషికాలు సినిమాకి పెట్టిన ఖర్చులో భాగం కాదని మీరు అంటున్నారు. సినిమాకి పెట్టే మొత్తం ఖర్చులో కేవలం 12 నుంచి 20శాతం మాత్రమే హీరోలకు పారితోషికంగా ఇస్తాం. ఇక్కడ ఒక విషయం మీరు తెలుసుకోవాలి. తమ సినిమా కనుక పరాజయం పొందితే హీరోలు పారితోషికాన్ని తగ్గించుకుంటారు. కొన్నిసార్లు వెనక్కి ఇచ్చేస్తారు.

గతంలో ఎంత మంది హీరోలు ఉద్దేశపూర్వకంగా తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారో లేదా కొంత మందిని వాపసు చేశారనే దానిపై పార్టీ వ్యక్తుల వద్ద ఎటువంటి డేటా లేదని, అత్తారింటికి దారేది సినిమా ఇంటర్నెట్‌లో లీక్ అయినప్పుడు నిర్మాతకు సహాయం చేయడానికి పవన్ తన రెమ్యునరేషన్ తగ్గించుకున్నాడని, చిరంజీవి కూడా అంజి కోసం తన రెమ్యూనరేషన్‌ను వదిలేసాడని, మహేష్ బాబు, తారక్, వరుణ్ తేజ్, చరణ్ లు కూడా సినిమా హిట్ అయితే రెమ్యూనరేషన్ పూర్తిగా తీసుకుంటారని వెల్లడించారు.

భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ తెలిసిన తర్వాతనే ఏపీ ప్రభుత్వం మూవీ టిక్కెట్ల ధరల పెంపు జీవోను విడుదల చేయలేదని నాగబాబు ఫైర్ అయ్యారు. తమ అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టే ధైర్యం ఉందా? అని నాగబాబు పరోక్షంగా వైసీపీ మంత్రులకు సవాల్ విసిరారు. ఈ రెండేళ్లైనా మంచి పాలన చేసి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు.

‘‘అఖండ’, ‘పుష్ప’ అదే ధరలకు ఆడాయి అంటున్నారు. కానీ, మీరు కనుక రేట్లలో సవరింపులు చేయకుండా ఉంటే ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చేవి. కాకపోతే వాళ్లు మాట్లాడలేకపోయారు. అది వాళ్ల వ్యక్తిగతం. అందరి హీరోలకు అది వర్కౌట్‌ కాదు. అందుకే మేము అడిగాం. చిరంజీవి లాంటి పెద్ద మనిషి.. హుందాతనాన్ని పక్కనపెట్టి, ఇండస్ట్రీ తరఫు నుంచి వెళ్లారు. ఆయన కేవలం హీరోల కోసం వెళ్లలేదు. కార్మికుల కోసం వెళ్లారు. ఎందుకంటే హీరోలు సినిమాలు చేయడం మానేస్తే ఎంతోమంది కుటుంబాలు ఆర్థికంగా దెబ్బ తింటాయి’’.

కేసీఆర్ గారి మీదో కెటీఆర్ గారి మీదో మేము విమర్శలు చేశాం. కాబట్టి మీ సినిమాలు ఇక్కడ ఆడకూడదు అని ఎప్పుడూ అనలేదు. రాజకీయం తెలిసిన వాళ్ళు… సినిమాని సినిమా గా, రాజకీయాన్ని రాజకీయంగా చూస్తారు.

అంతగా అయితే కొడాలి నాని లాంటి ఆర్టిస్టులను పెట్టుకుని మీరే సినిమాలు చేయండి. ఇక మీ ప్రభుత్వంలో అంత బాగా నటించే హీరోయిన్లు లేరు. కాస్త కష్టమే అయినా రెమ్యూనరేషన్ పే చేస్తే దొరుకుతారని ఉచిత సలహా ఇచ్చారు.

‘‘జగన్‌ గారూ.. ఇంకా రెండేళ్ల కాలం ఉంది. ఈ రెండేళ్లు అయినా పగా ప్రతీకారాలతో కూడిన పాలన మానేసి, మంచి పాలన చేయండి. మీ పాలన ఎలా ఉందో తెలియాలంటే ఒక్కసారి ప్రజల్లోకి రండి. మీ పాలనలో ఎంతమంది బాధపడుతున్నారో? ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు, అవన్నీ ఎవరి నుంచి వసూలు చేస్తున్నారు? మీరు మంచిగా పరిపాలించండి. మేము కూడా సంతోషిస్తాం. మిమ్మల్ని ఏమైనా అంటే… మీ మంత్రులు మాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు.

కానీ మేము అలా మాట్లాడటం లేదు. ఇంకా రెండేళ్లు సమయం మీకు వుంది. సినిమా వాళ్ల మీద ఫోకస్ పెట్టకండి. అవసరం అయితే తలా లక్షరూపాయలు వేసుకొని సినీ కార్మికులను ఆదుకుంటాము. వైసిపి లో నాకు మంచి స్నేహితులు వున్నారు. జగన్ గారు మీకు వున్న విషయం చెపుతున్నాను తప్పుగా తీసుకోకండి. మంచి పరిపాలన చేయండి’.. అని నాగబాబు వ్యాఖ్యానించారు..

‘సినిమా పరిశ్రమలోని అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే. రాజకీయాలతో మనకు ఏం సంబంధం ఉండదు. మీరు భయపడకండి. ప్రభుత్వాలపై ఆధారపడకుండా ఎలా డబ్బు సంపాదించాలనే విషయాన్ని ఆలోచిద్దాం. ఇండస్ట్రీ వాళ్ళు కొంచెం ఆశ తగ్గించు కొని యూనిటీ గా వుంటే మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. మనం వీళ్ళకు భయపడితే చిన్న కార్మికులు రోడ్డున పడతారు.. ప్రభుత్వ తీరుపై గళమెత్తుదామని నాగబాబు వ్యాఖ్యానించారు.  

Related posts