ఐపీఎల్ 2020లో తొలిసారి ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ పోరులో నిరాశపరిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 156 పరుగులు చేయగా.. మరో ఎనమిది బంతులు ఉండగానే ముంబై లక్ష్యాన్ని ఛేదించింది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో కలిసిన ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ మహ్మద్ కైఫ్ మాట్లాడుతూ… ‘ఐపీఎల్ 2021లో మిగిలిన ఆ ఒక్క మెట్టు ఎక్కాలని అనుకుంటున్నాం. అదే మా లక్ష్యం. అది సాధించడానికి గల ఆటగాళ్లు మాకున్నారు. కప్పు సాధించడానికి గతేడాది మేం చాలా దగ్గరి వరకూ వెళ్లాం. అదే ఈసారి మాకు అతిపెద్ద సానుకూలత. రిషబ్ పంత్‌తో పాటు చాలా మంది కీలక ఆటగాళ్లు ఇటీవల బాగా ఆడుతున్నారు. మంచి ఫామ్‌లో ఉన్నారు. అయితే కీలక ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ గాయం కాస్త నిరాశపరిచింది’ అని కైఫ్ తెలిపాడు. ‘మా ఆటగాళ్లంతా ఇప్పటికే సాధన మొదలెట్టారు. ముఖ్యంగా ఫ్లడ్‌లైట్ల కింద క్యాచులు పట్టడం నేర్చుకుంటున్నారు. మా కోచ్ రికీ పాంటింగ్ ఇప్పుడు క్వారంటైన్‌లో ఉన్నారు. అతడిని కలిసేందుకు ఆసక్తిగా ఉన్నా. పాంటింగ్ బయటకు రాగానే మా ప్రాక్టీస్‌కు సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తాం’ అని మహ్మద్ కైఫ్ చెప్పాడు.
previous post
విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం రాజకీయం: వీహెచ్