telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అమెరికాను వణికిస్తున్న .. బ్రెయిన్ ఈటింగ్ అమీబా ..

new brain eating amoeba found in america

అగ్రరాజ్యం ఆయుధాలు అమ్ముకుంటూ, అభివృద్ధి చెందుతున్న దేశాలపై తెరవెనుక దుర్మార్గపు చర్యలకు అనుభవిస్తున్నట్టే ఉంది. ప్రకృతి వైపరీత్యాలతో కొద్దికొద్దిగా అంతం అవుతుంది. తాజాగా, అత్యంత అరుదైన ‘బ్రెయిన్ ఈటింగ్ అమీబా’ సోకి నార్త్ కరోలినాకు చెందిన ఓ వ్యక్తి మరణించడంతో అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు. వేసవిలో తాజాగా ఉన్న నీటిలో ఈ వైరస్ ఉంటుంది. ఇటీవల ఓ వాటర్ పార్క్ లో నిర్మితమైన కృత్రిమ చెరువులో ఈతకొట్టేందుకు వెళ్లిన వ్యక్తి, ‘బ్రెయిన్ ఈటింగ్ అమీబా’ బారినపడి చనిపోయాడని వైద్యులు స్పష్టం చేశారు. చనిపోయిన వ్యక్తి పేరు, వివరాలను వెల్లడించేందుకు మాత్రం అధికారులు నిరాకరించారు. కంబెర్లాండ్ కౌంటీలోని హోప్ మిల్స్ వాటర్ పార్క్‌ లో అతను ఈత కొట్టాడని తెలుస్తోంది.

వైద్య పరిభాషలో అతనికి సోకిన వ్యాధిని ‘నెగ్లేరియా ఫొవ్లేరి’ గా పిలుస్తారు. ముక్కు ద్వారా శరీరంలోకి సోకే ఈ వైరస్, నేరుగా మెదడును చేరి తినేస్తుంది. ఇన్ఫెక్షన్ సోకిన ఐదు రోజుల తరువాత వ్యాధి లక్షణాలు బయటపడతాయి. ఆపై ఐదు రోజుల్లోనే ప్రాణం పోతుందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధికారులు వెల్లడించారు. 1962 నుంచి ఇప్పటివరకూ 145 మంది ఈ వ్యాధితో మరణించారని, ఇప్పుడు మరోసారి ఈ వైరస్ బయటకు రావడంతో స్విమ్మింగ్ పూల్స్ లోకి దిగేందుకు ప్రజలు జంకుతున్నారని తెలుస్తోంది.

Related posts