telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

బండి సంజయ్ కి సవాల్ విసిరిన శ్రీనివాస్ గౌడ్..

srinivas goud trs

ఉద్యమ సమయంలో బండి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఉద్యోగులుగా ఉండి తెలంగాణ కోసం ప్రాణం పోయినా సరే అన్నట్లుగా పోరాడాము.. అదృష్టంతో అధ్యక్షుడుగా అయ్యావు.. నిలుపుకో అని హెచ్చరించారు. తెలంగాణలో మీరు సహకరించక పోయినా.. కేంద్రంలో మీ అవసరం ఉంటుంది అని ఆలోచించామన్నారు.  బిజెపి నాయకులు తెలంగాణ కోసం జైలుకు పోయారా… రాజీనామా చేశారా..? అని నిలదీశారు. బీజేపీని దిగజార్చి మేం విమర్శించలేదు..ఎవడో పేపర్ పంపితే చూసి చదువుతారా అని ఫైర్ అయ్యారు. చెమట రక్తంతో మేం భూమి కొన్నాం..ఎన్ఓసి తీసుకొని భూమి కొన్నామన్నారు. నేను ఇల్లు కట్టుకుంటే ఇంత మంటా ? డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ నుంచి అనుమతి చేసుకున్నామని పేర్కొన్నారు. ఐదు ఎకరాల 34 గుంటల కంటే గజం ఎక్కువ ఉంటే.. మొత్తం ఇచ్చేస్తా అని పేర్కొన్నారు.  పాస్ బుక్ లో ఉన్నదాని కంటే.. ఒక్క గజం ఎక్కువ ఉన్నా.. ఆస్తి మొత్తం దానం చేస్తానన్నారు. బండి సంజయ్  నాపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే, అన్ని పదవులకు రాజీనామా చేస్తా.. నిరూపించక పోతే బండి సంజయ్ రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. 

Related posts