telugu navyamedia
క్రీడలు వార్తలు

కోహ్లీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన డానియల్‌ క్రిస్టియన్‌…

బెంగళూరు ఆల్‌రౌండర్ డానియల్ క్రిస్టియన్ టీమ్‌మేనేజ్‌మెంట్ ఆగ్రహానికి గురయ్యాడు. ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రిస్టియన్ తన కెప్టెన్ విరాట్ కోహ్లీపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. తమ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి ఐపీఎల్‌ కంటే డబ్యూటీసీ(వరల్డ్‌ టెస్టు చాంపియన్‌) ఫైనల్‌ ముఖ్యమని ఇప్పుడు దానిపైనే కన్నేశాడని పేర్కొన్నాడు. ఆ క్రమంలోనే నెట్స్‌లో న్యూజిలాండ్‌ క్రికెటర్‌ కైల్ జెమీసన్‌ వద్ద ఉన్న డ్యూక్‌ బాల్స్‌ను వేయమని కోరినట్లు తెలిపాడు. అయితే దానికి జెమీసన్‌ నిరాకరించాడని వివాదాస్పద రీతీలో చెప్పుకొచ్చాడు. మరొకవైపు ఆర్‌సీబీ సమావేశాలకు పూర్తి స్థాయిలో హాజరుకావడం లేదని, ఏదో కొన్నింటికి మాత్రమే వస్తున్నాడని ఆ ఇంటర్య్యూలో పేర్కొన్నాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టింది. ఒక జట్టు కెప్టెన్‌ను అవమానపరిచేలా ఉన్న ఆ వీడియోపై ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే క్రిస్టియన్‌కు వార్నింగ్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. దాంతో ఆ వీడియోను యూట్యూబ్‌ చానల్‌ నుంచి డిలీట్‌ చేయమని క్రిస్టియన్‌ స్వయంగా ‘ద గ్రేడ్‌ క్రికెటర్‌’కు విన్నవించుకున్నాడు. ఆ చానల్‌ హోస్ట్‌ అయిన సామ్‌ పెర్రీని ఆ వీడియోను తీసేయమని క్రిస్టియన్‌ అభ్యర్థించాడట. ఈ విషయాన్ని అతనే సోషల్ మీడియా వేదిక తెలుపుతూ వీడియో తీసేయడాని గల కారణాన్ని తెలియజేశాడు.

Related posts