telugu navyamedia
తెలంగాణ వార్తలు

హైదరాబాద్ లో 8 చోట్ల ఈడీ సోదాలు..చీకోటీ ప్రవీణ్, మాధవరెడ్డి ఇళ్లల్లో సోదాలు

*హైదరాబాద్ లో 8 చోట్ల ఈడీ సోదాలు

*చీకోటీ ప్రవీణ్, మాధవరెడ్డి ఇళ్లల్లో సోదాలు
*గుడివాడ క్యాసినో వ్య‌వ‌హ‌రంపై ఆరోప‌ణ‌లు
*ఫెమా కేసు నమోదు చేసిన ఈడీ

హైదరాబాద్ నగరంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తుంది. ఏక‌కాలంలో మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలను నిర్వహిస్తున్నారు. ఈ దాడులు క్యాసినో నిర్వహించే లోకల్‌ ఏజెంట్లపైనే జరిగినట్లు తెలుస్తోంది.

లోకల్ ఏజెంట్లు చీకోటీ ప్రవీణ్, మాధవరెడ్డి ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తుంది. ఐఎస్ సదన్‌కు చెందిన ప్రవీణ్, బోయిన్‌పల్లిలో నివాసం ఉంటున్న మాధవ రెడ్డితో పాటు పలువురు ఏజెంట్ల ఇళ్లల్లో ఈడీ అధికారులు ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్నారు. 

చీకోటి ప్రవీణ్ గతంలో క్యాసినో నిర్వహిస్తూ పట్టుబడ్డాడ‌ని స‌మాచారం. అతడిపై సీబీఐ కేసు కూడా నమోదయింది.క్యాసినో ఆడించటంలో ప్రవీణ్ దిట్ట అని పోలీసులు చెబుతున్నారు.

అతనిపై గతంలో నమోదయిన కేసులను పరిగణనలోకి తీసుకుని తాజాగా ఈడీ సోదాలు నిర్వహిస్తుంది .ఫెమా కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. గుడివాడ, హైదరాబాద్ లో క్యాసినోల నిర్వహిస్తున్న కేసులో గతంలో చీకోటి ప్రవీణ్ అరెస్ట్ అయ్యారు.

జూన్ 10,11, 12, 13 తేదీల్లో బోయిన్ పల్లిలో మాధవ రెడ్డి కేసినో నిర్వహించినట్టుగా ఆరోపణలున్నాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి నేపాల్ కు పేకాటరాయుళ్లను తరలించిన‌ట్లు తెలుస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ డ్యాన్సర్లతో కేసినో సందర్భంగా డ్యాన్స్ నిర్వహించినట్టుగా ఆరోపణలున్నాయి. దీంతో.. ఫెమా నిబంధనల కింద కేసు నమోదు చేసింది ఈడీ.

Related posts