telugu navyamedia
క్రీడలు వార్తలు

మరో రికార్డు సాధించిన మిస్టర్ ఐపీఎల్…

చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాట్స్‌మన్‌, మిస్టర్ ఐపీఎల్ సురేశ్‌ రైనా అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో 200 మ్యాచ్‌ ఆడిన నాలుగో క్రికెటర్‌గా రికార్డు పుస్తకాల్లోకెక్కాడు. అంతేకాదు 200 మ్యాచ్‌ ఆడిన రెండో సీఎస్‌కే ఆటగాడిగా కూడా నిలిచాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌ ద్వారా రైనా ఈ ఫీట్‌ను సాధించాడు. చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇప్పటికే ఐపీఎల్ టోర్నీలో 200 మ్యాచులు ఆడిన విషయం తెలిసిందే.ఓవరాల్‌గా ఐపీఎల్‌ టోర్నీలో 200వ మ్యాచ్‌లు ఆడిన నాలుగో ప్లేయర్‌గా సురేష్ రైనా గుర్తింపు పొందాడు. అంతకుముందు ఎంఎస్ ధోనీ (210), ముంబై ఇండియన్స్ సారథి రోహిత్‌ శర్మ (206), కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ బ్యాట్స్‌మెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (203)లు 200 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడారు. ఇక రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్ విరాట్‌ కోహ్లీ 200వ ఐపీఎల్‌ మ్యాచ్‌కు అడుగుదూరంలో ఉన్నాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగనున్న మ్యాచ్‌లో కోహ్లీ ఈ మైలురాయిని చేరుకోనున్నాడు. ప్రస్తుతం అతడు 199 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడాడు.

Related posts