telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“పలాస” దర్శకుడిని అభినందించిన అల్లు అర్జున్

Allu-Arjun

1978 ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించారు దర్శకుడు కరుణ కుమార్. ఈ ఏడాది అరభంలో వచ్చిన ‘పలాస 1978’ చిత్రం మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి ఈ సినిమాలోని పాటలు యూట్యూబ్ లో మారుమ్రోగుతున్నాయి. ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా తనకు ఎంతగానో నచ్చిందని హీరో అల్లు అర్జున్ తెలిపాడు. తాను సినిమా చూశానని, వ్యక్తిగతంగా ఎంతో నచ్చిందని, గొప్ప అంతర్లీన సందేశంతో సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని బన్నీ తన ట్విట్టర్ లో తెలిపాడు. ఇక ఈ సినిమా చూసిన మరుసటి రోజున దర్శకుడిని కలిసి అభినందించాడు. దీనికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు బన్నీ. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీకి చాలా మంది ప్రతిభావంతులైన దర్శకులు, నటులు వస్తున్నారని అలాంటి వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అని బన్నీ తెలిపాడు. అటు పలాస చిత్ర యూనిట్ కు కూడా బన్నీ శుభాకాంక్షలు తెలియజేశాడు.

Related posts