telugu navyamedia
సినిమా వార్తలు

నేడు భారతరత్న లతామంగేష్కర్ 90వ పుట్టినరోజు

Latha-Mangeshkar

నేడు ప్రముఖ గాయని లతామంగేష్కర్ 90వ పుట్టినరోజు. ఆమె సెప్టెంబరు 28న జన్మించారు. ప్రపంచంలోనే అత్యధికంగా పాటలు పాడినందుకు 1974లో లత పేరు ‘గిన్నీస్ వరల్డ్ రికార్డ్’లో నమోదైంది. లత 20 బాషల్లో 30 వేలకు మించిన పాటలు పాడారు. లత తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశారు. ఆమెను విజయం అంత సులభంగా వరించలేదు. ఇండోర్‌లోని మరాఠీ కుటుంబానికి చెందిన పండిట్ దీన్ దయాళ్ మంగేష్కర్ ఇంట లత జన్మించారు. ఆమె తండ్రి రంగస్థల కళాకారుడు. దీంతో చిన్నప్పటి నుంచే లతకు కళలపై ఇష్టం ఏర్పడింది. లత అసలు పేరు ‘హేమ’ ఆమె పుట్టిన ఐదేళ్ల తరువాత తల్లిదండ్రులు ఆమెకు “లత” అనే పేరుపెట్టారు. తండ్రి ప్రోత్సాహంతో ఐదేళ్ల వయసు నుంచే లత సంగీత శిక్షణ ప్రారంభించారు. తొలుత లత నాటకాల్లో వివిధ పాత్రలు ధరించారు. తరువాత ఆమె పూర్తిగా సంగీతంపైనే దృష్టి సారించారు. బాల్యంలో లత స్కూలుకు వెళ్లకపోయినా, తదనంతర కాలంలో తన గాన ప్రతిభతో న్యూయార్క్ యూనివర్శిటీతో సహా ఆరు విశ్వవిద్యాలయాల నుంచి డాక్టరేట్ పురస్కారాలను అందుకున్నారు. అత్యున్నత పురస్కారాలైన ‘భారతరత్న’, ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డులను అందుకున్న భారత్‌కు చెందిన ఏకైక గాయనిగా లత ఖ్యాతి గడించారు.

Related posts