గతేడాది ‘రాక్షసన్’, ‘ఆడై’ విజయాలతో మంచి జోష్‌లో ఉన్న అమలాపాల్ 2020లో డిజిటల్ ఫ్లాట్‌ఫాంలో అడుగు పెడుతోంది. అడవుల్లో అడ్వంచర్ నేపథ్యంతో తమిళంలో ఆమె నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘అదో అంద పరవై పోల’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో అమలాపాల్‌కి ఛాన్స్ వచ్చింది. అయితే అది వెబ్ సిరీస్ లో. దీనిపై అమలాపాల్ మాట్లాడుతూ జీవితంలో కొన్ని సంఘటనలు ఆశ్చర్యానికి గురి చేస్తాయని, బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ వెబ్‌సిరీస్ కోసం తనను సంప్రదించడం కూడా అలాంటిదేనని పేర్కొంది. ఆయన దర్శకత్వంలో నటించాలని దక్షిణాది తారలు ఆశపడుతుంటారని, అలాంటిది తనకు వెతుక్కుంటూ అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది.
previous post
next post