telugu navyamedia
Uncategorized వార్తలు సినిమా వార్తలు

సంక్రాంతి రేసులో పెరుగుతున్న పోటీ దారులు…

Tollywood

కరోనా అనంతరం థియేటర్లు తెరవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కనీసం వచ్చే నెల నుంచి అయినా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని సినిమా థియేటర్లు తెరుచుకునే అవకాశాలు బాగానే ఉన్నాయి. లాక్‌డౌన్ తరువాత ప్రేక్షకులను అలరించేందుకు వరుస సినిమాలు రానున్నాయి. క్రిస్మస్ నుంచి ఒకదాని తరువాత ఒకటిగా సినిమాలు విడుదల కానున్నాయి. అయితే కొన్ని సంక్రాంతి బరితో తల పడేందుకు సిద్దంగా ఉన్నాయని ప్రకటించారు.  సంక్రాంతి పోరులో వకీల్ సాబ్ ఖచ్చితంగా ఉంటుందని అభిమానులు అంటున్నారు. ఈ విషయం పై చిత్ర బృందం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ మరి కొన్ని సినిమాలు మాత్రం సంక్రాంతి బరిలో పోరాడతామని క్లారిటీ ఇచ్చాయి. రామ్ హీరోగా చేస్తున్ ‘రెడ్’, కేజీఎఫ్, అఖిల్ నటిస్తున్న మోస్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రవితేజ క్రాక్ సినిమాలు సంక్రాంతికి గోదాలో తలపడనున్నాయి. అయితే అధికారికంగా ప్రకటించిన చిత్రాలే కాకుండా మరికొన్ని సినిమాలు సంక్రాంతికి విడుదల కానున్నాయి. గోపీచంద్ చేస్తున్న సీటీమార్ సినిమా కూడా సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. దీనిపై సరైన క్లారిటీ అయితే ఇంకా ఇవ్వలేదు. గోపీచంద్ చేస్తున్న ఈ సినిమాపై బాగానే అంచనాలు ఉన్నాయని, సంక్రాంతికి రిలీజ్ చేస్తే బాగానే కాసులు కురుస్తాయని మేకర్స్ అనుకుంటున్నారు. దానికి తోడుగా చాలా గ్యాప్ తరువాత థియేటర్లలో సినిమాలు విడుదల కానున్నాయి. దాంతో పోటీ ఎక్కువగా ఉన్నా విడుదల అయ్యేందుకు అనేక సినిమాలు సన్నద్దం అవుతున్నాయి. వీటితో పాటు మరికొన్ని సినిమాలు సంక్రాంతికి రెడీ అవుతున్నాయి.

Related posts