telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అప్పుడు ఖిల్జీ గా రణవీర్ సింగ్‌… ఇప్పుడు నాగ సాధువుగా సైఫ్ అలీఖాన్

Laal

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ తాజాగా “లాల్ కప్తాన్” అనే చిత్రాన్ని చేస్తున్నాడు. నవదీప్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పీరియాడిక్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. చిత్రంలో సైఫ్ నాగ సాధు గెటప్‌లో కనిపించనున్నారు. ఇంతకుముందు దర్శన్ పద్మావత్ సినిమాలో రణవీర్ సింగ్‌కు ఖిల్జీ లుక్ తీసుకువచ్చారు. ఈ లుక్ అభిమానులను ఎంతగానో అలరించింది. ఈ సందర్భంగా దర్శన్ మాట్లాడుతూ సైఫ్‌కు ఈ లుక్ తీసుకువచ్చేందుకు చాలా శ్రమించాల్సి వచ్చిందన్నారు. నాగ సాధువులు సామాజిక జీవితంలో అన్ని అంశాలను త్యజిస్తారు. ఎప్పుడూ ఒక కర్ర పట్టుకుని కనిపిస్తుంటారు. పరమేశ్వరుని ప్రేరణ అనుసారం ప్రవర్తిస్తుంటారు. తమ గురించి తాము ఆలోచించుకోరు. జాటాధారిగా ఉంటారు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని సైఫ్‌కు నాగ సాధువు లుక్ తీసుకువచ్చానని తెలిపారు. 18వ శతాబ్దంలో ఓ బ్రిటీష్‌ కెప్టెన్‌పై పోరాడిన నాగసాధువు కథ ఆధారంగా చిత్రం రూపొందుతుంది. ఇలాంటి పాత్రలో సైఫ్ నటించడం ఇదే తొలిసారి కాబట్టి ప్రేక్షకులు కూడా బాగానే ఆదరిస్తార‌ని చెప్ప‌వ‌చ్చు. అక్టోబర్ 18న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. సోనాక్షి సిన్హా అతిథి పాత్రలో కనిపించనున్నారు. మానవ్ విజ్, జోయా హుస్సేన్, దీపిక్ డోబ్రియల్, సిమోన్ సింగ్ కీలక పాత్రలు పోషించారు. కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ఆనంద్ ఎల్ రాయ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా, సైఫ్.. ‘తానాజీ ది అన్‌సంగ్ హీరో’, ‘దిల్ బిచారా’, ‘జవానీ జానేమన్’ అనే డిఫ‌రెంట్ చిత్రాల‌తో ప్ర‌స్తుతం బిజీగా ఉన్నారు.

Related posts