telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

న్యూ ఇయర్‌కు పవన్‌ గిఫ్ట్‌ ఇదే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రీ ఎంట్రీ వకీల్ సాబ్ సినిమాతో ఇవ్వనున్నాడు. ఈ సినిమాను హిందీ మూవీ పింక్‌కు రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ గెటప్‌లో కనిపించనున్నడు. ఈ సినిమా అనేక అవాంతరాల తరువాత ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాను ముందుగా సంక్రాంతికి విడుదల చేస్తామన్నారు. కానీ తరువాత సంక్రాంతికి వకీల్ సాబ్ రావడం లేదంటూ అభిమానులను నిరాశ పరిచింది. అంతేకాకుండా ఈ మధ్య కొత్త అప్‌డేట్‌లు కూడా లేవు. దాంతో పవర్ స్టార్ అభిమానుల సాగిలబడ్డారు. అయితే నూతన సంవత్సర కానుకగా వకీల్ సాబ్ చిత్ర బృందం అభిమానులకు స్పెషల్ గిఫ్ట్ ప్లాన్ చేస్తున్నారట. ఇవాళ సరికొత్త అప్‌డేట్‌ను రాత్రి 00:00కు ఇవ్వనున్నట్లు తెలిపారు. అయితే అదేంటి అనేది క్లారిటీ లేదు. ఈ అప్‌డేట్ ఇవ్వనున్న విషయాన్ని చిత్ర యూనిట్ ట్విటర్ వేదికగా తెలిపింది. దాంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. పవర్ స్టార్ న్యూ లుక్ విడుదల చేస్తారా, గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నారా ఇలా అనేక ఊహలు చేస్తున్నారు పవర్ స్టార్ అభిమానులు. ఈ అప్‌డేట్ ఏంటో తెలుకోవాలంటే రాత్రి వరకు ఆగాల్సిందే.

Related posts